»Those Posts On Pawans Wife Janasena Has Sent Legal Notices To Them
Pawan Kalyan: పవన్ భార్యపై ఆ పోస్టులు..వారికి లీగల్ నోటీసులు పంపిన జనసేన!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడో భార్య గురించి అసభ్యకరంగా ట్వీట్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని, క్షమాపణలు చెప్పకుంటే చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని జనసేన పార్టీ హెచ్చరించింది. అసభ్య పోస్టులు పెట్టిన వారి వివరాలను తెలుపుతూ ట్వీట్ చేసింది.
ఏపీ(AP)లో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కుటుంబ సభ్యులపై పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై నేడు జనసేన(janasena) ప్రకటన విడుదల చేసింది. సోషల్ మీడియాలో పవన్ కుటుంబీకుల(Pawan Family Members)పై అసభ్య పోస్టులు పెడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు జనసేన హెచ్చరించింది.
జనసేన వీరమహిళ అకౌంట్ ట్వీట్:
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆయన కుటుంబంపై వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ పెయిడ్ మీడియా చేస్తున్న దుష్ప్రచారం, అసభ్య వ్యాఖ్యలపై జనసేన వీర మహిళ విభాగం డీజీపీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేస్తున్నారు. ఇలాంటి అసభ్య ట్వీట్స్ వేస్తున్న వ్యక్తులపై ఏపీ డీజీపీ చర్యలు… https://t.co/W6PH0K3GKv
— JanaSena VeeraMahila (@JSPVeeraMahila) July 7, 2023
గత కొన్ని రోజుల నుంచి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మూడు పెళ్లిళ్లను లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ(YCP)కి అనుకూలంగా ఉండే మీడియా(Media), యూట్యూబ్ ఛానళ్ల(Youtube Channels)లో పవన్ గురించి రకరకాలుగా చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా కొణిదెల (Anna Konidela)ను లక్ష్యంగా చేసుకుని పోస్టులు పెడుతున్నారని జనసేన(Janasena) ఆగ్రహం వ్యక్తం చేసింది. అటువంటివారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.
జనసేన పార్టీ ట్వీట్:
#JanaSenaParty has decided to take strict legal action against those who are resorting to false and baseless circulation of rumours on the personal life of Sri @PawanKalyan garu.
రాష్ట్రంలోని ప్రజల దృష్టిని మార్చేలా, అలాగే జనసేన(janasena) క్యాడర్ను నేతల్ని లక్ష్యంగా చేసుకుని పోస్టులు పెడుతున్నట్లు జనసేన ఆరోపించింది. వాటిపై ఇకనైనా సోషల్ మీడియా(Social media)లో క్షమాపణలు చెప్పాలని, లేకుంటే చట్టపరంగా రెచ్చగొట్టడం, పరువునష్టం వేయడం, నేరపూరిత కుట్ర వంటి ఆరోపణలతో కేసులు నమోదు చేయనున్నట్లు జనసేన హెచ్చరించింది(Janasena Warning).