»Ys Sharmila Key Decision Her Land Transfer To Son Rajareddy And Daughter
YS Sharmila: కీలక నిర్ణయం..తన భూములను ఏం చేశారో తెలుసా?
ఈరోజు(జులై 8న) వైఎస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి. ఈ సందర్భంగా ఇప్పటికే వైఎస్ షర్మిల(ys sharmila) కడప చేరుకున్నారు. శనివారం ఉదయం తల్లి విజయమ్మ, కొడుకు, కూతురు, ఇతర కుటుంబీకులతో కలిసి ఆమె వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పించనున్నారు. కానీ నిన్న తన పేరుతో ఉన్న భూమిపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
వైఎస్సార్సీపీ అధినేత సీఎం జగన్ సోదరి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(ys sharmila) తన భూముల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్య రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. శనివారం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ నుంచి కడపకు వచ్చిన షర్మిల తన కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలితో కలిసి వచ్చారు. కడప విమానాశ్రయానికి చేరుకున్న షర్మిల తన ఇద్దరు పిల్లలను తీసుకుని వేంపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లారు. ఇడుపులపాయలో తన పేరు మీద ఉన్న 9.53 ఎకరాలను షర్మిల తన కుమారుడు(son) రాజా రెడ్డి పేరిట రిజిష్టర్ చేయించారు. అదే విధంగా ఇడుపులపాయ ఎస్టేట్ వ్యవహారాలు చూసే వెంగముని రెడ్డి నుంచి షర్మిల కొనుగోలు చేసిన 2.12 ఎకరాల భూమిని కూతురు(daughter) అంజలి పేరు మీద రిజిస్టర్ చేశారు. అనంతరం వేంపల్లి రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి షర్మిల కుటుంబ సభ్యులు(family) ఇడుపులపాయ ఎస్టేట్‌కు చేరుకున్నారు.
ఈ అనూహ్య పరిణామం వెనుక ఏం జరిగిందనే చర్చ కొనసాగుతుంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అఫిడవిట్ సమస్యలు రాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారా? అని పలువురు భావిస్తున్నారు. లేదంటే రాజకీయంగా ఉపయోగించుకునే ప్రక్రియలో భాగంగానే షర్మిల ఈ నిర్ణయం తీసుకున్నారా? అని అనుకుంటున్నారు. లేదంటే అన్న జగన్ తో విభేదాల కారణంగా ఇలా హఠాత్తుగా నిర్ణయం తీసుకున్నారా? అనే చర్చ కూడా పలువురిలో మొదలైంది. ఏది ఏమైనా ఆకస్మాత్తుగా తన పేరు మీదు ఉన్న భూమి(land) బదిలీ చేయడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే కొంత కాలంగా షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి ఇడుపులపాయ సాక్షిగా ఆమె క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.