మాస్టర్ ప్లాన్ పేరిట తమ పొలాలను లాక్కొవద్దనే డిమాండ్ తో కామారెడ్డి, జగిత్యాల రైతులు చేస్తున్న పోరాటం విజయం దిశగా సాగుతోంది. వారి పోరాటాలకు మున్సిపల్ కౌన్సిల్స్ దిగొస్తున్నాయి. మాస్టర్ ప్లాన్ ముసాయిదాలను రద్దు చేయాలని ఆయా మున్సిపల్ కౌన్సిల్స్ ఏకగ్రీవ తీర్మానం చేశాయి. దీంతో త్వరలోనే ఆ ముసాయిదాలు రద్దయ్యే అవకాశం ఉంది. రైతుల తీవ్ర ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం ముసాయిదాల రద్దుకే మొగ్గు చూపనుంది. జగిత్...
టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్ కి ఏపీ సీఐడీ పోలీసులు మళ్లీ నోటిసులు పంపారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఆయన ఇంటికి వెళ్లి 41ఏ నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ అధికారులు విజయ్ నివాసానికి వెళ్లారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో తల్లికి నోటీసులు అందించారు. ఈ నెల 27న మంగళగిరిలో సీఐడీ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ‘భారతి పే’ పేరిట పోస...
ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ సభలో మజ్లిస్ హాజరు కాలేదు. ఎంఐఎంను సీఎం కేసీఆర్ ఎందుకు ఆహ్వానించలేదో తెలియడం లేదని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ఆ రెండు పార్టీలు కలిసే ఉంటున్నాయని, జాతీయ వేదికను మాత్రం పంచుకోకపోవడం ఏంటీ, ఇందులో ఏదో జిమ్మిక్కు ఉందన్నారు. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ ఆఫర్ ఇచ్చారని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యలను మంత్రి పువ్వాడ అజయ్ కూడా...
నాలుగు నెలలుగా భారత్ జోడో యాత్ర చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ న్యూలుక్ తో కనిపించారు. తొలిసారి జాకెట్ ధరించి కనిపించారు. ప్రస్తుతం దేశంలో చలి తీవ్రత పెరిగి.. ఉత్తరాదిలో పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం జమ్మూలోని కతువాలో రాహుల్ జాకెట్ ధరించి కనిపించారు. చలిగా ఎక్కువగా ఉన్నా సరే కేవలం టీ షర్ట్ మాత్రమే వేసుకొని జోడో యాత్రను కొనసాగించారు. జ...
తెలంగాణ ఇంచార్జీ డీజీపీ అంజనీకుమార్ ఏపీ క్యాడర్‌కు చెందిన వారు అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఈ అంశంపై తాను ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు చేశానని వివరించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడికి వెళ్లి పని చేయాలన్నారు. సుప్రీంకోర్టు కూడా ఇదే విషయం చెప్పిందన్నారు. కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్)...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై టీడీపీ, జనసేన ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. అధికారం చేజిక్కించుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు వ్యుహాలు రచిస్తున్నారు. 2014 ఎన్నికల మాదిరిగా 2024లో అధికారం దక్కించుకోవాలని అనుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో చర్చలు జరుపుతున్నారు. పవన్ కూడా చంద్రబాబుతో కలిసి పనిచేయడానికి సుముఖంగా ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తిరిగి అధికారం చేపట్టాలంటే కాపు...
ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేటాయింపుపై విచారణను తెలంగాణ హైకోర్టు ఈ రోజు (శుక్రవారం) చేపట్టింది. 12 మంది బ్యూరోక్రాట్ల క్యాడర్‌పై వేసిన పిటిషన్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎన్ తుకారాంజీతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. అధికారుల కేటాయింపునకు సంబంధించి ట్రైబ్యునల్ వేర్వేరుగా తీర్పులు వెలువరించిందని చీఫ్ జస్టిస్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అభిప్రాయపడ్డారు. అన్ని పిటిషన్లప...
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావుకు ప్రతిష్టాత్మక భారత రత్న అవార్డు వరించనుంది. సినీ నటుడిగా సమాజానికి, రాజకీయ వేత్తగా ప్రజలకు సేవ చేసినందుకు అవార్డు ఇచ్చి గౌరవించాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటుందట. ఈ అంశం గురించి ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా చర్చించారని విశ్వసనీయంగా తెలిసింది. ఎన్టీఆర్‌కు భారత రత్న అవార్డు ఇవ్వాలని చాలా రోజుల నుంచి టీడీపీ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరు...
నేను రాజకీయం నుండి దూరంగా ఉన్నాను… కానీ రాజకీయం నా నుండి దూరం కాలేదు… ఇది చిరంజీవి ఇటీవలి సినిమాలో బాగా పాపులర్ అయిన డైలాగ్. ఏ ఉద్దేశ్యంతో ఆ సినిమాలో డైలాగ్ పెట్టారో కానీ నిజజీవితంలోను అదే కనిపిస్తోంది. ఆయన రాజకీయాల్లో ఫెయిల్యూర్ కావొచ్చు.. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అశేష అభిమానులు కలిగిన నటుడు. ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ నేపథ్యంలో ఏ పార్టీ అయినా ఆయన కోసం ఆశగా చూస్తుంటుందనడంలో ...
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ పై మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా.. వారిపై విమర్శల వర్షం కురిపించారు. కమీషన్ల కోసమే కాఫర్ డ్యాం లేకుండా డయాఫ్రం వాల్ కట్టారని ఆరోపించారు. ప్రాజెక్టులకు డబ్బులు కేటాయించడం, వాటాలు కొట్టేయడం, దోపిడీలు చేయడం, దొడ్డిదారిన పదవులు చేపట్టడం మీకు, మీ కుమారుడికి అలవాటే అన్నారాయన. నేను మీకన్నా వంద రెట్లు నిజాయితీపరుడ్ని గుర్తుపెట్టుకో...
ఖమ్మంలో నిర్వహించిన తమ బీఆర్ఎస్ పార్టీ సభ విజయవంతమైందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సభకు పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు లక్షలాదిగా హాజరయ్యారని ఆయన చెప్పారు. ముగ్గురు ముఖ్యమంత్రులు, ఒక మాజీ ముఖ్యమంత్రితో నిర్వహించిన సభ చరిత్రలో నిలిచిపోనుందన్నారు. మైదానంలో చిన్నపాటి సముద్రం కనిపించిందన్నారు. మైదానం సరిపోక బయటే లక్షమంది దాక బీఆర్ఎస్ కార్యకర్తలు ఉండిపోయారని తెలిపారు మంత...
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్. ఆయనపై చర్చలు తీసుకోవాలని రెజ్లర్లు వరుసగా మూడో రోజు జంతర్ మంతర్ వద్ద ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే ఇది రాజకీయ కుట్రలో భాగమని, ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం నిర్వహించి అన్నీ బయటపెడతానని బ్రిజ్ భూషణ్ తెలిపారు. రెజ్లర్ల నిరసన తీవ్రం కావడంతో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ రంగ...
గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. అజ్మీర్ దర్గాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో మంగళ్‌హాట్ పోలీసులు 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. రాజాసింగ్‌పై చర్యలు తీసుకోవాలని సయ్యద్ మహమూద్ అలీ గతేడాది ఆగస్టులో కంచన్ బాగ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసును కంచన్ బాగ్ నుంచి మంగళ్‌హాట్ స్టేషన్ మార్చారు. తాజాగా ఇచ్చిన నోటీసులపై రాజా సింగ్ స్పందించారు. పోలీసులు తనను అరెస...
ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ సక్సెస్ అయింది. ఇక వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి సభలు, పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఆయన మొదటి చూపు ఆంధ్రప్రదేశ్ వైపు ఉంది. విశాఖపట్నంలో భారీ బహిరంగ సభను ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ కాపు నేత తోట చంద్రశేఖరరావును ఏపీ బీఆర్ఎస్ చీఫ్‌గా నియమించారు. ఆయన ఆధ్వర్యంలో సభను ప్లాన్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. సభ ఎప్పుడు, ఎక్కడ అనేది త్వరల...
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాం గోపాల్ పేట అగ్నిప్రమాదం జరిగిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సర్కార్ వద్ద డబ్బులు లేవని, అందుకే అక్రమంగా భవనాలకు పర్మిషన్ ఇస్తుందని తెలిపారు. ప్రమాదానికి గురయిన దక్కన్ మాల్ భవనాన్ని ఈ రోజు (శుక్రవారం) కిషన్ రెడ్డి పరిశీలించారు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు సహకారాలు అందించాలని కోరారు. కాలిపోయిన భవాన్ని కూల్చివేయాలన్నారు. ఆ భవనాలను కూల్చివేసే సమయంలో చుట్టుపక్కల ...