ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై టీడీపీ, జనసేన ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. అధికారం చేజిక్కించుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు వ్యుహాలు రచిస్తున్నారు. 2014 ఎన్నికల మాదిరిగా 2024లో అధికారం దక్కించుకోవాలని అనుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో చర్చలు జరుపుతున్నారు. పవన్ కూడా చంద్రబాబుతో కలిసి పనిచేయడానికి సుముఖంగా ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తిరిగి అధికారం చేపట్టాలంటే కాపుల ఓట్లే కీలకం.. వారిని తనవైపు తిప్పుకోవాలని చంద్రబాబు అనుకుంటున్నారు.
చంద్రబాబు ఎత్తులు
కాపుల ఓట్ల కోసం చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారు. పవన్ కల్యాణ్‌ను ముందు నిలబెట్టి కాపుల ఓట్లు రాబట్టాలని భావిస్తున్నారు. 2014లో పవన్- చంద్రబాబు మధ్య ఒప్పందం జరిగిందని, అందుకోసమే జనసేన పోటీ చేయలేదని అంటుంటారు. 2019కి వచ్చేసరికి పరిస్థితి మారింది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చేందుకు జనసేన బరిలోకి దిగింది. ఈసారి కూడా రెండు పార్టీలు కలిసి బరిలోకి దిగుతాయి. కాపుల ఓట్ల కోసం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను తమ ప్రధాన ప్రచార అస్త్రంగా వాడుకునే అవకాశం ఉంది. ఇప్పటికీ 60 శాతం కన్నా ఎక్కువ మద్దతు సీఎం జగన్‌కు ఉందని సమాచారం.
స్టార్ క్యాంపెయినర్
పవన్ కల్యాణ్‌ను అడ్డుపెట్టుకుని కాపుల ఓట్లు కొల్లగొట్టాలని చంద్రబాబు చూస్తున్నారు. పరిస్థితులు మాత్రం ఆశాజనకంగా లేవు. గ్రౌండ్ లెవల్లో వైసీపీకి మంచి ఆదరణ ఉందని తెలుస్తోంది. జనసేన పార్టీ ఎన్నికల్లో మాత్రం ప్రభావం చూపలేకపోయింది. టీడీపీకి అయితే 68 చోట్ల ఇంచార్జీలే లేరని తెలుస్తోంది. వీరిద్దరూ కలిసి జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోగలరా? అనే ప్రశ్న వస్తోంది. ఇద్దరు కలిసి జగన్‌ను ఎదుర్కొలేరని, అందుకే కాపు ఓటు బ్యాంకును మలచుకునేందుకు చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తన స్టార్ క్యాంపెయినర్ పవన్ కల్యాణ్ అని చంద్రబాబు తన సన్నిహితులతో చెబుతున్నారట.
లెక్కలివే?
ఇప్పటి ఓటర్లు అవేర్ నెస్ కలిగి ఉన్నారు. ఎవరు వస్తే తమకు ఏం చేస్తారు అని ఆలోచన చేస్తున్నారు. గత ఎన్నికలను బేరిజు వేసుకొని మరీ తీర్పు చెబుతారు. ఈ సారి కూడా కాపుల ఆలోచన ఏ వైపు ఉందో తెలియడం లేదు. చంద్రబాబు అయితే పవన్ కల్యాణ్ ప్రచారం, ఆయన ద్వారా వచ్చే కాపుల ఓట్ల గురించి మాత్రమే నమ్మకంతో ఉన్నారు.