గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. అజ్మీర్ దర్గాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో మంగళ్‌హాట్ పోలీసులు 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. రాజాసింగ్‌పై చర్యలు తీసుకోవాలని సయ్యద్ మహమూద్ అలీ గతేడాది ఆగస్టులో కంచన్ బాగ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసును కంచన్ బాగ్ నుంచి మంగళ్‌హాట్ స్టేషన్ మార్చారు. తాజాగా ఇచ్చిన నోటీసులపై రాజా సింగ్ స్పందించారు. పోలీసులు తనను అరెస్ట్ చేయాలని కోరారు. తనకు 5 నెలల తర్వాత నోటీసులు వచ్చాయన్నారు. ఈ కేసుపై కూడా పీడీ యాక్ట్ ప్రయోగించాలన్నారు.
అంతకుముందు మహ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించి అరెస్ట్ చేశారు. కొన్ని నెలలు జైలులోనే ఉండగా.. బెయిల్ రావడంతో ఇటీవల విడుదలయ్యారు. హైదరాబాద్‌లో మునావర్ ఫారుఖీ స్టాండప్ కమెడియన్ షో అనుమతి రద్దు చేయాలని కోరారు. మునావర్ హిందువులను కించపరిచారని ఆరోపించారు. మునావర్ షోకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో జరిగింది. దీంతో రాజాసింగ్ యూట్యూబ్‌లో వీడియో అప్ లోడ్ చేశారు. వీడియో వైరలవడంతో పోలీసులు రాజాసింగ్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
తన భర్తను అక్రమంగా జైలులో నిర్బంధించారని రాజాసింగ్ సతీమణి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పీడీ యాక్ట్‌ను హైకోర్టు క్వాష్ చేసింది. కానీ కొన్ని షరతులను విధించింది. మీడియాతో మాట్లాడొద్దు, ర్యాలీలలో పాల్గొనద్దు, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొద్దని కండీషన్ పెట్టింది. బెయిల్ రావడంతో రాజా సింగ్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు అజ్మీర్ దర్గాపై చేసిన వ్యాఖ్యలపై పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే ఏడాది కింద చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు నోటీసులు ఇవ్వడం ఏంటని రాజా సింగ్ న్యాయవాది కరుణాసాగర్ ప్రశ్నించారు. ఇది కక్ష సాధింపు చర్య అంటున్నారు. తాము చట్టానికి లోబడి నోటీసులకు స్పందిస్తామని తెలిపారు. కేసును కోర్టులో ఎదుర్కొంటామని.. న్యాయస్థానం, చట్టంపై తమకు గౌరవం ఉందన్నారు.