టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్ కి ఏపీ సీఐడీ పోలీసులు మళ్లీ నోటిసులు పంపారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఆయన ఇంటికి వెళ్లి 41ఏ నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ అధికారులు విజయ్ నివాసానికి వెళ్లారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో తల్లికి నోటీసులు అందించారు.
ఈ నెల 27న మంగళగిరిలో సీఐడీ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ‘భారతి పే’ పేరిట పోస్టులు పెట్టినట్టు విజయ్ పై అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కేసులోనే తాజాగా నోటీసులు ఇచ్చారు.