తన సోదరి ప్రీతిది ఆత్మహత్య ఏమాత్రం కాదని, హత్యేనని సోదరుడు చెబుతున్నారు. తన సోదరిది హత్య అనేందుకు తన వద్ద ఆధారాలు ఉన్నాయని, ఆత్మహత్య అని చెప్పడానికి వారి వద్ద ఏం ఆధారాలు ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు.
తాము ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నట్లు చాలా కాలంగా ప్రచారం సాగుతోందని, కానీ అలాంటిది ఏమీ లేదని విశాఖ శారదా పీఠం (visakha sarada peetham) ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్పష్టం చేశారు.
ఏ పార్టీకి మెజార్టీ రాకపోయినా బీజేపీ గెలిచిన వారిని బుట్టలో వేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. గతంలో అలానే ఈశాన్య రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకుంది. పార్టీల్లో చీలికను తీసుకువచ్చి వారిని పార్టీలో చేర్చుకుని బీజేపీ అధికారం చేపట్టిన విషయాలు తెలిసిందే. తాజాగా అదే మాదిరి కాషాయ పార్టీ అడుగులు వేయనుంది.
నేను కూడా ముసలోడిని అవుతున్నా. 69 ఏళ్లు వచ్చాయి. నా కన్నా వయసులో పెద్దవాడైనా.. నేను ఉన్నన్ని రోజులు పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ ప్రజలకు సేవ చేస్తాడు. ఆయన్ను వదిలిపెట్టేది లేదు. ఆయన మాటే బ్రహ్మాస్త్రం.
Renuka Chowdary : కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సంచలన ఆరోపణలు చేశారు. దివంగత రాజశేఖర్ రెడ్డికి ఈ సంతానం మూలంగా సుఖం లేకుండా పోయింది అని ఆమె అన్నారు. ఆయన ఆత్మకు ఆత్మశాంతి లేకుండా జగన్ పిచ్చి వేషాలు వేస్తున్నారని అన్నారు.
munirajamma:ఏపీ సీఎం జగన్ (jagan) అరాచకాలు పెరిగిపోతున్నాయని టీడీపీ యువనేత నారా లోకేశ్ (nara lokesh) అన్నారు. తన యువగళం పాదయాత్రలో చాలా మంది సమస్యలు చెబుతున్నారని వివరించారు. శ్రీకాళహస్తిలో (sri kalahasti) మునిరాజమ్మ-వెంకటాద్రి (munirajamma-venkatadri) అనే రజక దంపతులను టార్చర్ పెట్టాడని తెలిపారు. ఆ వీడియోలో మునిరాజమ్మ తన గోడును వెల్లబోసుకుందని తెలిపారు.
VH : భూపాలపల్లి సభలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి పై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆయనపై టమాటాలు, కోడిగుడ్లు, రాళ్లు విసిరికొట్టారు. కాగా.... ఈ ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహనుమంతరావు మండిపడ్డారు. రాళ్లు వేసి కొట్టడం ఎంత వరకు న్యాయం? ప్రజాస్వామ్యమా ఇది రాచరికమా..? అని ఆయన ప్రశ్నించారు.
kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తన కేబినేట్ లో కీలక మార్పులు చేపట్టారు. ఇద్దరు కొత్త వారికి మంత్రి పదవులు కట్టబెట్టారు. పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్ ఇద్దరు ప్రస్తుతం జైల్లో ఉండడంతో అధినేత కీలక నిర్ణయం తీసుకున్నారు. జైల్లో ఉన్న ఇద్దరి మంత్రుల రాజీనామాలు ఆమోదించిన తర్వాత ఇద్దరు కొత్త నాయకులకు మంత్రి పదవులు కట్టబెట్టారు. అతిషి, సౌరవ్ భర...
Minister Kakani : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి కాకాణి గోవర్థన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ ఓ జోకర్ అని ఆయన పేర్కొనడం గమనార్హం. పవన్ గురించి మాట్లాడితే తమకే అవమానమని ఆయన అభిప్రాయపడ్డారు.
Somu Verraju : వచ్చే ఎన్నికల్లో తాము కచ్చితంగా విజయం సాధిస్తామని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాము జనసేనతో కలిసి పోటీ చేస్తామని... కచ్చితంగా విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. ఏపీలో అధికారం తమదేనని అన్నారు.
ys bhaskar reddy get notice to cbi:వైఎస్ వివేకానంద హత్యకేసులో సీబీఐ విచారణ తుది దశకు చేరింది. ఇటీవల హైదరాబాద్‌లో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని (avinash reddy) సుధీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి (ys bhaskar reddy) సీబీఐ (cbi) నోటీసులు జారీచేసింది.
Rahul Gandhi : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లుక్ మార్చారు. మొన్నటి వరకు ఆయన జోడో యాత్ర పేరిట దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. పాదయాత్ర సమయంలో ఆయన విపరీతంగా గడ్డం పెంచేశారు. కాగా... ఇప్పుడు ఆ గడ్డం తీసేసి స్మార్ట్ లుక్ లో కనిపించడం విశేషం.
కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించినప్పుడు తొలిసారి స్థానిక సంస్థల ఎన్నికల్లోనే పోటీ చేసి తెలంగాణ వాదాన్ని బలంగా చాటారు. పార్టీ ప్రారంభించిన కొన్ని రోజులకే అత్యధిక స్థానాలు గెలుపొంది కేసీఆర్ సంచలనం రేపారు. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ముందు మహారాష్ట్ర స్థానిక ఎన్నికలు కూడా ఆ విధంగానే ఉపయోగపడతాయని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.