»Kodandarama Challenge To Brs Minister Ktr On Two Lakh Govt Jobs Telangana
KTRకు కొదండరాం సవాల్..చర్చకు రావాలని వెల్లడి
తెలంగాణ జనసమితి (TJS) అధ్యక్షుడు కోదండరాం(kodandaram) అధికార పార్టీ మంత్రి కేటీఆర్(KTR)కు సవాల్ విసిరారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పటివరకు రెండు లక్షలు కల్పించామని చెబుతున్న దాంట్లో నిజం లేదని అన్నారు. ఈ క్రమంలో ఈ అంశంపై మంత్రి కేటీఆర్ చర్చలకు రావాలని ఛాలెంజ్ చేశారు.
Kodandarama challenge to brs minister KTR on two lakh govt jobs telangana
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ పరీక్షలను సరిగ్గా నిర్వహిస్తే కోర్టులో కేసులు ఎందుకు వేస్తారని టీజేఎస్(TJS) అధ్యక్షుడు కోదండరాం(kodandaram) బీఆఎర్ఎస్ మంత్రి కేటీఆర్(KTR)ను ప్రశ్నించారు. కేటీఆర్ విద్యార్థులు కేసులు వేస్తేనే ఉద్యోగ పరీక్షలు రద్యయ్యాయని చేసిన వ్యాఖ్యలపై కోదండరాం స్పందించారు. ఇప్పటికే గ్రూప్ 1 ఎగ్జామ్ రెండు సార్లు సరిగ్గా నిర్వహించలేదన్నారు. దీంతోపాటు గతంలో కూడా ఎగ్జామ్ పేపర్లు లీక్ చేసి విద్యార్థుల సమయం వృథా చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దలకు తెలియకుండానే ఇదంత వ్యవహారం జరిగిందా అని కోదండరాం మంత్రిని నిలదీశారు.
అంతేకాదు ఇటివల సూసైడ్ చేసుకున్న ప్రవళిక కూడా గ్రూప్స్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యిందని గుర్తు చేశారు. ప్రిపేర్ అయినట్లు ఆమె నోట్స్ కూడా ఉందని అన్నారు. ఆ క్రమంలో హైదరాదాబ్లో ఉండి ఉద్యోగం సాధించిన తర్వాతనే ఆమె ఇంటికి వస్తానని ప్రతిజ్ఞ చేసుకున్నట్లు చెప్పారు. అలాంటి విద్యార్థిపై అనవసర ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె జీవితం గురించి వారి పేరెంట్స్ చెప్పిన నిజాలు ఇంకా కళ్లముందు తిరుగుతున్నాయని అన్నారు. ఆమె ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే ప్రభుత్వం ఆమెపై అబాండాలు వేసిందని వ్యాఖ్యానించారు. అంతేకాదు రాష్ట్రంలో(telangana) ఇప్పటివరకు లక్షకంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదని కోదండరాం అన్నారు. ఇటివల కేటీఆర్ చెప్పిన లెక్కలన్ని అవాస్తమని తెలిపారు. ప్రస్తుతం రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్న దాంట్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఈ అంశంపై మంత్రి కేటీఆర్(KTR) దమ్ముంటే చర్చకు రావాలని కోదండరాం సవాల్ చేశారు.