వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శనివారం జరుగుతున్న టెట్ పరీక్షను సజావుగా నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాల వద్ద 163 BNSS అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సన్ సింగ్ తెలిపారు. పరీక్ష కేంద్రాల చుట్టూ 500 మీటర్ల పరిధిలో గుంపులు, సభలు, ర్యాలీలు నిషేధం. ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.