»Another Shock For Brs Party Boath Mla Rathod Bapurao Resign To Brs Party
BRS partyకి మరొషాక్..ఇంకో ఎమ్మెల్యే రిజైన్
తెలంగాణలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికార పార్టీలో సీటు దక్కని అసంతృప్తి నేతలు ఇతర పార్టీలకు మారుతున్నారు. తాజాగా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు రేవంత్ రెడ్డిని కలిశారు. రేపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
Another shock for BRS party boath mla rathod bapurao resign to brs party
బోథ్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని రాథోడ్ బాపురావు కలిశారు. అధికార పార్టీ నుంచి బోథ్ ఎమ్మెల్యే టిక్కెట్ తనకు కేటాయించకపోవడంతో అసంతృప్తితో ఉన్న నేత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బోథ్ ఎమ్మెల్యే టిక్కెట్ కాంగ్రెస్ పార్టీ తరఫున బాపురావుకు ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇక అధికార బీఆర్ఎస్ పార్టీ తరపున ఈసారి బోథ్ ఎమ్మెల్యే బరిలో అనిల్ జాదవ్ ఉన్నారు. ఇంకోవైపు కోదాడ మాజీ ఎమ్మెల్యే చందర్ రావుతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. అతను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ క్రమంలో పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతోపాటు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కూడా కార్పొరేటర్ సహా ఇంకొంత మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.