Karnataka Elections 2023: కర్ణాటక అసెంబ్లీ గత ఎన్నికల్లో బీజేపీకి 104 సీట్లు, కాంగ్రెస్‌కి 80 సీట్లు రాగా కుమారస్వామి నేతృత్వంలోని జనతాదళ్(సెక్యులర్) పార్టీకి 37 సీట్లొచ్చాయి. పెద్ద పార్టీలు రెండింటికీ సరైన మెజారిటీ రాకపోవడంతో జేడీఎస్ పార్టీ మద్దతు తప్పనిసరిగా మారింది.
దీంతో ఎలాగైనా అధికారంలో ఉండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నేరుగా జేడీఎస్‌తో పొత్తు పెట్టుకుంది. ఈ పొత్తు కోసం ఏకంగా సీఎం సీటునే కుమారస్వామికి త్యాగం చేసింది.
అలా అనుకోకుండా కర్ణాటక ప్రభుత్వంలో జేడీఎస్ పార్టీ కింగ్ మేకర్ మారడమే కాకుండా.. ఏకంగా కుమారస్వామి కింగ్ కూడా అయ్యారు. కానీ.. విచిత్రంగా 2019లో తర సీఎం పదవికి రాజీనామా చేసి అధికారం నుంచి తప్పుకున్నారు.
ఇక ఈ దఫా ఎన్నికలకు సంబంధించి విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌లో కూడా ఏ పార్టీకి అధిక మెజారిటీ రాదని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కచ్చితంగా జేడీఎస్ కీలక పాత్ర పోషిస్తుందని వార్తలొచ్చాయి.
దీంతో ఈ సారైనా అధికారాన్ని కచ్చితంగా దక్కించుకోవాలని కుమారస్వామి బలంగా కోరుకున్నారట. కానీ అనుకోని విధంగా ఫలితాల్లో కాంగ్రెస్‌కు పూర్తి మెజారిటీ వస్తున్నట్లు కనిపిస్తుండడంతో కుమారస్వామి ఆశలన్నీ గల్లంతయ్యాయని విశ్లేషకులు అంటున్నారు.
కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్‌ని పూర్తిగా దాటే అవకాశాలు కనిపిస్తుండడంతో కుమరస్వామి ఆశలు నిజంగానే గల్లంతయ్యేలా కనిపిస్తున్నాయి.