AP: సరస్వతి ప్రాజెక్టు కోసం 2009లో 30 ఏళ్లకు భూములను లీజుకు తీసుకుని.. 50ఏళ్లకు పెంచుకున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ భూముల్లో 24.78 ఎకరాల కుంటలు, చెరువులు స్వాధీనం చేసుకున్నారని విమర్శించారు. ప్రజల వద్ద భూములు లాక్కొని సొంత ఆస్తి మాదిరిగా.. కుటుంబంలో కొట్టుకుంటున్నారన్నారు. సహజ వనరులు ఏ ఒక్కరి సొంతం కాదన్న పవన్.. ఇష్టానుసారం ఎవరైనా మాట్లాడితే.. ఊరుకునేది లేదన్నారు. భూములిచ్చిన రైతులకు అండగా ఉంటానన్నారు.