AP: పల్నాడు జిల్లా మాచవరంలో మాజీ సీఎం జగన్కు చెందిన సరస్వతి పవర్ ప్రాజెక్టుకు కేటాయించిన భూములను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. సరస్వతి ప్రాజెక్టుకు తీసుకున్న భూముల్లో 300 ఎకరాల అటవీ భూమి ఉందని.. రెవెన్యూలోకి అక్రమంగా మార్చారని మండిపడ్డారు. రైతుల వద్ద అసైన్డ్ భూములు కూడా తీసుకుని.. వారికి ఇప్పటివరకు పరిహారం ఇవ్వలేదని విమర్శించారు. దీనిపై విచారణ జరిపిస్తామన్నారు. ఈ విషయంపై కేబినెట్లో చర్చిస్తామన్నారు.