TG: గత పదేళ్లలో హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చే ప్రయత్నం చేశారా? అని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. పాతబస్తీలో మెట్రోరైలు నిర్మాణాన్ని అడ్డుకున్నారని.. కాంగ్రెస్ పార్టీ రింగ్ రోడ్డు నిర్మిస్తే రూ.7380 కోట్లకు అమ్ముకున్నారని మండిపడ్డారు. HYDకు ఒక టీఎంసీ నీళ్లు తెచ్చే ప్రయత్నం చేశారా? అని నిలదీశారు. పదేళ్లు అధికారంలో ఉన్నా వాటర్ లాగింగ్ సెంటర్లు అలాగే ఉన్నాయని మంత్రి విమర్శించారు.