AP: యూనివర్సిటీల్లో చదివి బయటకు వచ్చే ప్రతి విద్యార్థికీ ఉద్యోగం రావాలని మంత్రి లోకేష్ తెలిపారు. ఉండవల్లిలోని నివాసంలో నైపుణ్యాభివృద్ధిశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో స్కిల్ సెన్సెస్, పాలిటెక్నిక్, ఐటీఐ కాలేజీల్లో ఉపాధి కల్పన, నైపుణ్య శిక్షణ తదితర అంశాలపై చర్చించారు. నియోజకవర్గాల వారీగా ప్రతి నెలా జాబ్ మేళా నిర్వహణకు క్యాలెండర్ రూపొందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.