ASF: ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. జిల్లాలో కొనసాగుతున్న కుటుంబ సర్వేలో అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.