TG: రాష్ట్రంలో కాలం చెల్లిన వాహనాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి నుంచి కొత్త వాహన తుక్కు(స్క్రాపింగ్) విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. దీంతో కాలం చెల్లిన వాహనాన్ని తుక్కుగా మారిస్తే స్క్రాపింగ్ సర్టిఫికెట్ ఇవ్వనుంది. కొత్త వాహనం కొనుగోలు చేసేటప్పుడు దీనిని చూపిస్తే రాయితీ లభిస్తుంది. పాత వాహనాలను తుక్కు చేసేందుకు శంషాబాద్, నందిగామ వంటి ప్రాంతాలలో ప్లాంట్లు పెట్టాలని సర్కారు నిర్ణయం తీసుకుంది.