TG: జైలు నుంచి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి లేఖ రాశారు. తన పేరుతో పోలీసులు ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ తప్పు అని ఆరోపించారు. కేటీఆర్ గురించి పోలీసులకు తానేమీ చెప్పలేదని తెలిపారు. పోలీసులు తన నుంచి స్టేట్మెంట్ తీసుకోలేదని పేర్కొన్నారు. రిమాండ్ రిపోర్టులో ఏముందో తనకు తెలియదన్నారు. తన అడ్వొకేట్ను కోరితే రిమాండ్ రిపోర్టు ఇచ్చారని చెప్పారు.