PDPL: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమాన్ని శుక్రవారం ఉ.11 గంటల నుంచి మ.12 గం.ల వరకు నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ నాగభూషణం ఒక ప్రకటనలో తెలిపారు. గోదావరిఖని, పెద్దపల్లి పట్టణ పరిసర ప్రాంత ప్రయాణికులకు ఆర్టీసీ సేవలు, సదుపాయాలపై సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. 9959 225922 నంబర్‌కు కాల్ చేసి సమస్యలను తెలపాలని సూచించారు.