TG: కలెక్టర్‌పై దాడి చేసిన రేపిస్టు సురేశ్ తమ పార్టీ నాయకుడని కేటీఆర్ చెప్పుకోవడం సిగ్గుచేటని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. అధికారం కోల్పోవడంతో కేటీఆర్ ఫ్రస్టేషన్లో ఉండి మాట్లాడుతున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండు రోజులకే కూలిపోతుందని, పడిపోతుందని స్టార్ట్ చేశారని పేర్కొన్నారు. అధికారం పోయేసరికి ఏం చేయాలో వారికి అర్థం కావడం లేదని వెల్లడించారు.