AP: గత ప్రభుత్వం రాజకీయాలను నేరమయం చేసిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు స్వీకరించిన రఘురామకృష్ణరాజుకు ఆయన అభినందనలు తెలిపారు. ‘మీ నియోజకవర్గంలో మిమ్మల్ని అడుగు పెట్టనివ్వమని ఛాలెంజ్ చేసిన వాళ్లే ఈరోజు సభలో అడుగు పెట్టలేకపోయారు. ఉండి నియోజకవర్గం నుంచి 56 వేల పైచిలుకు ఓట్లతో గెలిచి మీరు అసెంబ్లీకి వచ్చారు. రాజకీయాల్లో నేరగాళ్లకు స్థానం ఉండకూడదు’ అని పేర్కొన్నారు.