ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత ఆటగాళ్లు కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్‌లను పాకిస్థాన్ రావాలని పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ కోరాడు. వచ్చే ఆటగాళ్లందరికీ సాదరంగా స్వాగతం పలుకుతామని పేర్కొన్నాడు. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి నెలల్లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. కాగా, ఆ దేశంలో పర్యటించేది లేదని బీసీసీఐ తేల్చి చెప్పేసింది.