AP: CM చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో అధికారంలోకి వచ్చి.. బడ్జెట్లో నిధులు కేటాయించకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. ఇచ్చిన హామీలపై పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు నిలదీస్తూ కచ్చితంగా పోస్టులు పెడతారని ట్విట్టర్లో పేర్కొన్నారు. వైసీపీ సభ్యులు ప్రశ్నిస్తే కేసులు పెడుతామని, అరెస్టులు చేస్తామని బెదిరింపులు చేస్తున్నారని మండిపడ్డారు.