VZM: నాటు సారా అమ్మిన తయారుచేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ నాయుడు అన్నారు. గురువారం ముసిరంలో ప్రభుత్వం ఇటీవల నిర్వహిస్తున్ననవోదయం 2.0 అనే కార్యక్రమంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజశేఖర్ నాయుడు మాట్లాడుతూ.. నాటుసారా తయారీ, అమ్మకం, అక్రమ మద్యం అమ్మకాలు నిర్వహించకూడదన్నారు.