TG: బూట్లతో ఆలయంలోకి వచ్చి, దురుసుగా ప్రవర్తించిన SIను సస్పెండ్ చేయాలని మేడ్చల్ జోన్ ACP కార్యాలయం ముందు అయ్యప్ప స్వాములు నిరసనకు దిగారు. మేడ్చల్ SI అశోక్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని ఏసీపీకి వినతిపత్రం అందించారు. నిన్న కండ్లకోయలో అయ్యప్ప స్వామి మహా పడి పూజ నిర్వహిస్తుండగా సౌండ్ ఎక్కువ పెట్టి పూజలు చేస్తున్నారని ఫిర్యాదు రావడంతో SI అశోక్ కుమార్ ఆలయానికి వెళ్లారు.