కర్ణాటకలోని బెల్గామ్‌లో జరిగిన CWC సమావేశంలో CM రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. జనగణనలో కులగణన చేపట్టాలని CM ప్రతిపాదనకు CWC ఆమోదం తెలిపింది. దేశంలో త్వరలో పార్లమెంట్ నియోజక వర్గాల పునర్విభజన జరిగే అవకాశాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి వెల్లడించారు. జనాభా ప్రాతిపదికన జరిగితే దక్షిణాది రాష్ట్రాలలో సీట్ల పెంపు తక్కువగా ఉండి నష్టపోయే పరిస్థితి ఉంటుందన్నారు.