మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. రాత్రి 9:51 గంటలకు ఆయన తుది శ్వాస విడిచినట్లు ఎయిమ్స్ వైద్యులు అధికారికంగా ప్రకటించారు. మన్మోహన్ మృతిపట్ల ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.