ఆరుగురు హైదరాబాద్ క్రికెటర్లపై బీసీసీఐ రెండేళ్లు నిషేధం విధించింది. అండర్-19 క్రికెట్లో వయసు తక్కువగా చూపినట్లుగా విచారణలో తేలడంతో వారిపై నిషేధం విధించింది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే అవినీతి కుంభకోణాల్లో పలు విచారణలు ఎదుర్కొంటున్న హెచ్‌సీఏకు యువ క్రికెటర్ల నిషేధం మరింత మచ్చ తెచ్చినట్లు అయింది.