ఇవాళ భారత విఖ్యాత పక్షి శాస్త్రవేత్త, పద్మవిభూషణ్ సలీం మొయిజుద్దీన్ అబ్దుల్ అలీ జయంతి. భారతదేశం అంతటా క్రమబద్ధమైన పక్షుల సర్వేలను నిర్వహించిన మొదటి భారతీయుడిగా సలీం అలీ పేరొందారు. పక్షుల్ని గమనిస్తూ ఉంటే మన పర్యావరణ వ్యవస్థ.. ఒక్కో ప్రాణి జీవితాన్ని ఎంత నాజూకుగా బ్యాలన్స్ చేస్తుందో అర్థమవుతుందని ఆయన చెప్పారు. ప్రకృతి ప్రసాదించిన ఈ వారసత్వ సంపదకు మనందరం సంరక్షకులంగా మారి.. ముందు తరాలకు అందించాలని సూచించారు.