NDL: రుద్రవరం మండలంలోని నాగులవరం గ్రామ సమీపంలో పేకాట స్థావరాలపై దాడులు చేసినట్లు ఎస్సై వర ప్రసాద్ తెలిపారు. గ్రామ సమీపంలోని పొదల్లో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించామన్నారు. పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.4,690ల నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.