ఉమ్మడి ప్రకాశం జిల్లాకు కీలకమైన వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.394 కోట్లు కేటాయించారు. అలాగే గుండ్లకమ్మకు సైతం రూ.13 కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించారు. మొత్తం జిల్లాలోని అన్ని ప్రాజెక్టులకు కలిపి ఎన్డీఏ ప్రభుత్వం రూ.444.15 కోట్లు కేటాయించిందని.. గత ప్రభుత్వం రూ.168.92 కోట్లనే బడ్జెట్లో ప్రతిపాదించిందని కూటమి నేతలు అన్నారు.