‘ఏజెంట్’ సినిమా తర్వాత అక్కినేని అఖిల్ తాజాగా మరో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరుతో అఖిల్ సినిమా చేయనున్నాడట. ఈ సినిమాపై క్రేజీ న్యూస్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఇది రాయలసీమ బ్యాక్డ్రాప్లో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎమోషన్స్ అభిమానులను ఆకట్టుకుంటాయని సినీ వర్గాల్లో టాక్. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది.