AP: గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులు తగ్గారని మండిపడ్డారు. అప్పట్లో ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలు తీసుకుందని, పని తక్కువ… పబ్లిసిటీ ఎక్కువ అని ఎద్దేవా చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు రూ.6,500 కోట్ల బకాయిలు పెండింగ్లో పెట్టారని ఆరోపించారు.