ASF: కాగజ్నగర్ పట్టణంలో మట్కా ఆడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లుగా పట్టణ సీఐ రాజేంద్రప్రసాద్ తెలిపారు. పట్టణంలోని గాంధీ చౌక్ పార్క్ వద్ద మట్కా ఆడుతున్నారనే పక్కా సమాచారంతో ఎస్ఐ రమేశ్, సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ముగ్గురు జూదరులను అరెస్ట్ చేసి, వారి ఉన్న సెల్ ఫోన్లను సీజ్ చేసినట్లు సీఐ వెల్లడించారు.