ఎక్కువ సేపు కూర్చుంటే నడుమునొప్పి వస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎక్కువ సేపు నిల్చుంటే కూడా సమస్యలు వస్తాయని చాలా మందికి తెలియదు. ఎక్కువ సమయం నిల్చుంటే కాళ్లలో రక్తప్రసరణ నిదానిస్తుంది. కాళ్లలో తిమ్మిర్లు రావడం, స్పర్శ లేకుండా పోవడం జరుగుతుందట. అంతేకాకుండా వెరికోస్ వెయిన్స్ సమస్య తలెత్తే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నిలబడాల్సి వస్తే.. ఒకే పొజిషన్లో 8 నిమిషాలకు మించి నిల్చోకూడదని సూచించారు.