AP: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్సిక్స్ పథకాల్లో భాగంగా మరో కీలక హామీకి ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది. 19-59 ఏళ్ల మధ్య ఉన్న SC, ST, BC, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఆర్థికసాయం అందించనుంది. ఇందుకోసం ‘మహిళలకు ఆర్థిక సహకారం’ పేరుతో బడ్జెట్లో రూ.3,341.82 కోట్లు కేటాయించింది. త్వరలోనే దీనికి సంబంధించి విధివిధానాలు రూపొందించనుంది.