TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మరోసారి ఢిల్లీ బాట పట్టనున్నారు. ఈరోజు సాయంత్రం ఆయన ఢిల్లీకి బయలుదేరుతారని.. అక్కడ ఓ ఆంగ్ల పత్రిక నిర్వహించనున్న కాంక్లేవ్‌లో పాల్గొంటారని వర్గాలు వెల్లడించాయి. అలాగే ఢిల్లీలోని కాంగ్రెస్ అగ్రనేతలతో కూడా సీఎం సమావేశం కానున్నారు. జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం, తాజా రాజకీయ పరిణామాలపై పార్టీ పెద్దలతో సీఎం చర్చిస్తారని తెలుస్తోంది.