ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ మాదిరిగా రష్యా గగనతలానికి పాంట్సిర్ ఏయిర్ డిఫెన్స్ మిస్సైల్-గన్ వ్యవస్థ రక్షణ వలయంగా నిలుస్తుంది. అయితే ఈ వ్యవస్థ త్వరలో భారత్కు అందుబాటులోకి రానుంది. ఈ ఏయిర్ డిఫెన్స్ సిస్టమ్ కోసం భారత్ డైనమిక్స్ లిమిటెడ్(BDL), రష్యాకు చెందిన రోసోబొరోనెక్స్పోర్ట్(ROE)తో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది.