TG: మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. సిరిసిల్ల రుద్రంగిలో పర్యటించిన ఆయన కూరగాయల మార్కెట్, సీసీ రోడ్డు ప్రారంభించారు. అనంతరం కేంద్రమంత్రి మాట్లాడుతూ.. రూ.15 వేల కోట్లతో మూసీ సుందరీకరణ అవుతుందని తెలిపారు. రూ.లక్షన్నర కోట్లతో మూసీ పనులు చేపట్టడానికి తాము వ్యతిరేకంగా ఉన్నట్లు చెప్పారు. మూసీ సుందరీకరణలో పేదలకు నష్టం కలిగిస్తామంటే సహించమని హెచ్చరించారు.