TG: హైదరాబాద్‌లో రెండో రోజు ఆపరేషన్ మూసీ కొనసాగుతోంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో సర్వే చేస్తూ నివాసితుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. మరోవైపు మారుతీనగర్‌లో సర్వే చేస్తున్న అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. సర్వేకు సహకరించేది లేదని తేల్చి చెప్పారు. కాగా, స్థానిక వ్యక్తి ఒకరు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించటంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.