»Woman Chopped Up Body Found Near Geeta Colony Flyover Delhi
Delhi: ఢిల్లీలో శ్రద్ధా తరహా కేసు..ముక్కలుగా లభించిన మహిళ మృతదేహం
ఢిల్లీలోని గీతా కాలనీ ప్రాంతంలోని ఫ్లై ఓవర్ సమీపంలోని పొదల్లో బుధవారం ఉదయం మృతదేహం లభ్యమైంది. మృతదేహం అనేక ముక్కలుగా నరికివేయబడి కనిపించింది. సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Delhi: ఢిల్లీలోని గీతా కాలనీ ప్రాంతంలోని ఫ్లై ఓవర్ సమీపంలోని పొదల్లో బుధవారం ఉదయం మృతదేహం లభ్యమైంది. మృతదేహం అనేక ముక్కలుగా నరికివేయబడి కనిపించింది. సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఫ్లైఓవర్ సమీపంలో మృతదేహం పడి ఉన్నట్లు పోలీసులకు ఉదయం 9గంటలకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న బృందం మృతదేహం ముక్కలు ముక్కలుగా పడి ఉండడం గమనించారు. సమీపంలో అమర్చిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీ ద్వారా మృతుల, నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
పోలీసు బృందం ఆర్థో ఫోరెన్సిక్ టీమ్ సహాయం తీసుకుంటోంది. తద్వారా మృతదేహంలోని ముక్కలు స్త్రీకి చెందినవా లేక పురుషుడివా అన్నది నిర్దారించనున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆ శరీరం స్త్రీదిగా భావిస్తున్నారు. 3 జిల్లాల పోలీసులు.. అధికారులు అక్కడే ఉన్నారు, ఒకే ప్రాంతంలోని రెండు వేర్వేరు ప్రదేశాల నుంచి దాదాపు 8 మృతదేహంలోని 8ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదంతం మరోసారి శ్రద్ధా హత్య కేసును గుర్తు చేసింది. గతేడాది శ్రద్ధా భాగస్వామి అఫ్తాబ్ ఆమెను గొంతుకోసి హత్య చేశాడు. హత్య అనంతరం ఆమె మృతదేహాన్ని 35కు పైగా ముక్కలు చేశారు. నిందితుడు మృతదేహం ముక్కలను వేర్వేరు చోట్ల పడేశారు. మరొక ఘటన ఢిల్లీలోని షహబాద్ డెయిరీ ప్రాంతంలో నెలన్నర క్రితం ప్రేమికుడు సాక్షిని పలుమార్లు కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన అంతా అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఇందులో నిందితుడు బాలికపై పాశవికంగా దాడి చేసి ఎలా హత్య చేశారో స్పష్టంగా కనిపించింది.