»Warriors Team Is A Great Success In Celebrity Cricket League
Warriors team : సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో వారియర్స్ టీమ్ ఘన విజయం
సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) (CCL) దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ ఘనంగా మొదలైంది. రాయ్‌పుర్ (Rayapur) వేదికగా తెలుగు వారియర్స్, కేరళ స్ట్రైకర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అక్కినేని అఖిల్ అదరగొట్టాడు. 30 బంతుల్లో 91 పరుగులు చేసి అబ్బురపరిచాడు. దీంతో తెలుగు వారియర్స్ జట్టు 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) (CCL) దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ ఘనంగా మొదలైంది. రాయ్‌పుర్ (Rayapur) వేదికగా తెలుగు వారియర్స్, కేరళ స్ట్రైకర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అక్కినేని అఖిల్ అదరగొట్టాడు. 30 బంతుల్లో 91 పరుగులు చేసి అబ్బురపరిచాడు. దీంతో తెలుగు వారియర్స్ జట్టు 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో యంగ్ హీరో అఖిల్ నాయకత్వం వహిస్తున్న తెలుగు వారియర్స్ (Warriors) జట్టు 64 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా, ఈ మ్యాచ్‌లో అఖిల్ (Akhil)అద్భుత ప్రదర్శన చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 91, రెండో ఇన్నింగ్స్‌లో 63 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించాడు. అయితే, ప్లేయర్లను ఎంకరేజ్ చేయడానికి ప్రముఖ సినీ నటులు వెంకటేశ్ (venkatesh) తదితరులు వచ్చారు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన తెలుగు వారియర్స్.. మొదటి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ సూపర్ ఇన్నింగ్స్ ఆడి 30 బంతుల్లో 91 పరుగులు చేశాడు. మరో ప్లేయర్ ప్రిన్స్ 23 బంతుల్లో 45 పరుగులు చేసి రాణించాడు. ఇలా మొదటి ఇన్నింగ్స్ లీడ్‌తో కేరళ( kerala) జట్టుకు 170 పరుగులు లక్ష్యన్ని నిర్దేశించింది తెలుగు టీమ్. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కేరళ జట్టు.. ఆఖరి ఓవర్లో 69 పరుగులు చేయాల్సి ఉంది. కానీ ఆ ఓవర్లో కేవలం 5 పరుగులు మాత్రమే చేశారు. దీంతో తెలుగు వారియర్స్ 64 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. కాగా మ్యాచ్ మొదలయ్యే ముందు నందమూరి తారకరత్న (Tarakaratna) మరణం పట్ల ప్లేయర్స్ సంతాపం తెలిపారు.
ఈ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. అఖిల్ (Akhil) బ్యాట్‌కు పని చెబుతూ.. స్కోరు బోర్డును పరుగెత్తిస్తున్నాడు. మరోవైపు, నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ క్రీజులోనే కూర్చున్నాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఓ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. దీంతో.. అఖిల్, ఇండియన్ క్రికెట్ టీమ్‌లో జాయిన్ అయితే బాగుంటుంది అంటూ కామెంట్ రాసుకొచ్చాడు. దిల్‌రాజు (dilraju) చేతికి నిర్మాతల మండలి!.. కొత్త అధ్యక్షుడిగా దామోదర ప్రసాద్ఈ సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ మ్యాచ్‌లు సాధారణ టీ20 మ్యాచ్ల్లా జరగవు. ఈ మ్యాచ్‌ల్లో టెస్టు క్రికెట్ తరహాలో పరిమిత ఓవర్ల ఇన్నింగ్స్ ఉంటాయి. అంటే.. ఒక్కో ఇన్నింగ్స్ 10 ఓవర్లు ఉంటుంది. అలా ఇరు జట్లు రెండేసి ఇన్నింగ్స్ ఆడతాయి. మిగతా అంతా టెస్టు క్రికెట్ మాదిరిగానే ఉంటుంది. దీంతో పాటు ఒక టీమ్ ఇన్నింగ్స్ పూర్తైన తర్వాత మరో జట్టు 5 నిమిషాల లోపు మైదానంలో ఉండాలనేది రూల్.
And we're off to a WILD start💪🏼
Had a blast playing with my favourite boys! Well done. Let's bring the trophy home, yet again…