ఫుడ్ విషయంలో మదర్స్ కాంప్రమైజ్ కారు. ఏ టూరో, దైవ దర్శనానికో వెళితే అడ్జస్ట్ కారు, కాలేరు. ఏ ప్రాంతానికి అనుగుణంగా ఫుడ్ తీసుకుంటారు. దేశంలో ఇలా అయితే మరీ ఫారిన్ వెళితే ఎలా ఉంటుంది.. అవును ఓ అమ్మకి ఇలాంటి సమస్యే వచ్చి పడింది. ఫుడ్, స్నాక్స్ అన్నీ వైరెటియే.. అమ్మ ఫుడ్ ఎలా తింటున్నావని కూతురు కావేరి అడిగింది. ఫర్లేదు అని చెప్పింది. ఎక్స్ ప్రెషన్స్ మాత్రం భలేగా ఇచ్చింది. ఆ వీడియోను మీరు కూడా చూసి కాసేపు నవ్వుకొండి.
కూతురు దగ్గరికి ఆమె తల్లి జర్మన్ వెళ్లింది. అక్కడ ఫుడ్ నచ్చకపోవడంతో అయిష్టంగానే తింటుంది. ప్రెజ్టల్ అనే స్నాక్ తింటుండగా కూతురు వీడియో తీసింది. అమ్మ ఎలా ఉంది అని పదే పదే అడిగింది. టీకే టీకే (బాగుంది, బాగుంది) అని చెబుతోంది. కానీ ఆమె ఎక్స్ ప్రెషన్స్ చూస్తే అర్థం అవుతుంది. ఆ వీడియోను ఇన్ స్టాగ్రామ్లో షేర్ చేయగా తెగ వైరల్ అవుతుంది. తన తల్లి జర్మన్ ఫుడ్ తినేందుకు ట్రై చేస్తోందని కావేరి చెబుతోంది. జంతికలు లాంటి ప్రెజ్టల్ తినడం వీడియోలో చూడొచ్చు. పిండితో తయారు చేసి, కాల్చిన పేస్ట్రీ.. తోసు రూపంలో విభిన్నంగా ఉంది.
ఎలా ఉంది అంటే ఫర్లేదు.. అని చెప్పింది. ఆమెకు నచ్చలేదని కావేరికి తెలుసు.. అందుకే పదే పదే అడిగింది. ‘చివరి వరకు వీడియో చూడండి, ప్రెజ్టల్ తనకు నచ్చిన ఫుడ్.. ఇష్టపడేందుకు సమయం పడుతుందని వీడియో’కు కావేరి క్యాప్షన్ రాసింది. ఈ వీడియోకు ఇప్పటికే 2 లక్షల వ్యూస్ వచ్చాయి. చాలా మంది నుంచి రియాక్షన్స్ వస్తున్నాయి. ఆంటీ ఎక్స్ ప్రెషన్స్ చెబుతున్నాయని ఆ ఫుడ్ గురించి అని ఒకరు రాశారు. తనకు కూడా ఆ ఫుడ్ నచ్చదని మరొకరు అన్నారు. తన తల్లికి కూడా ఇలాంటి సిచుయేషన్ వచ్చిందని మరొకరు కామెంట్ చేశారు.