తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు ఊహించని షాక్ తగిలింది. ప్రదీప్ రావుకి ఉన్న సెక్యూరిటీని ప్రభుత్వం తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రదీప్ రావుకు ఉన్న గన్ మెన్ లను తొలగిస్తూ… ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. తన సెక్యూరిటీని తొలగించడం పట్ల… ఆయన ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు.
తాను బీజేపీలో చేరినందుకే గన్మెన్లను ప్రభుత్వం తొలగించిందని ప్రదీప్‌రావు ఆరోపణలు చేశారు. ఓ ఎమ్మెల్యే నా అంతు చూస్తానని బెదిరిస్తున్నాడు. ఇలాంటి సమయంలో గన్మెన్ల తొలగింపు కక్షసాధింపు చర్యే అంటూ ప్రదీప్‌రావు మండిపడ్డారు. వెంటనే తనకు భద్రత పెంచాలని డిమాండ్ చేశారు. ఇక ప్రదీప్ రావు కు ఏడేళ్లుగా నలుగురు గన్మెన్లు ప్రదీప్‌రావుకు భద్రత కల్పిస్తున్నారు. ఇప్పుడు, ఆ నలుగురు గన్మెన్లను పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది ప్రభుత్వం.
ఈ మధ్యనే ప్రదీప్ రావు టిఆర్ఎస్ ను వీడి బిజెపి లో చేరడం జరిగింది. పార్టీలో తనకు విలువలేదని అందుకనే రాజీనామా చేసినట్లు ఎర్రబెల్లి ప్రదీప్ రావు చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో ఎమ్మెల్యే నరేందర్ ను ఉద్దేశించి పలు ఆరోపణలు చేసారు.
వరంగల్ ను రూ.4 వేల కోట్లు పెట్టి అభివృద్ధి చేసుంటే ప్రజలు నిజంగానే బ్రహ్మరథం పడతారని ఎమ్మెల్యే నరేందర్ ఉద్దేశించి విమర్శలు చేశారు. నరేందర్ కు దమ్ముంటే రాజీనామా చేయాలని ప్రదీర్ రావు సవాల్ విసిరారు. వరంగల్ అభివృద్ధి ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ఆయన సంస్కారహీనుడని మండిపడ్డారు. తనకు టికెట్ ఇస్తానని నమ్మించి మోసం చేశారని ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఆరోపించారు.