తెలంగాణ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. కాగా… ఈ బడ్జెట్ లో ప్రభుత్వం రుణ మాఫీ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. అంతేకాదు.. వ్యవసాయ వృద్ధిపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.
తెలంగాణ వ్యవసాయ వృద్ధి దాదాపు రెండు రెట్లు అధికంగా నమోదు అయ్యింది. దేశ వ్యవసాయ వృద్ధి రేటు 4శాతం కాగా.. తెలంగాణ వ్యవసాయ వృద్ధిరేటు 7.4శాతంగా ఉందన్నారు మంత్రి హరీష్రావు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్ ఉంటుందన్నారు. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపిస్తోందని, కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అందనప్పటికీ.. సొంతకాళ్లపై నిలబడి ప్రజలకు ఇచ్చిన హామీలు, ఆకాంక్షలను నిలబెట్టే విధంగా ముందుకెళ్తున్నామని అన్నారు మంత్రి హరీష్రావు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగాయన్నారు. దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణగా తెలంగాణ ఎదిగిందన్నారు. రైతన్నను ఆదుకోవడానికి రైతు బంధు తీసుకొచ్చామన్నారు. రైతు బంధు నిధులను సమయానికి అందిస్తూ ఆదుకుంటున్నామన్నారు. రైతు రుణమాఫీకి రూ.6,385 కోట్లు కేటాంచమన్నారు. త్వరలోనే రుణమాఫీ కి సంబదించిన ప్రక్రియ మొదలవుతున్నాడని వెల్లడించారు.