»Take Care Of Your Stomach Foods That Keep You Healthy
Health Tips: కడుపును కాపాడుకోండిలా.. ఆరోగ్యంగా ఉంచే ఆహారాలివే
కడుపు నొప్పితో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. వారంతా సరైన ఆహార పదార్థాలు తీసుకోకపోవడం వల్లే సమస్యను కొని తెచ్చుకుంటున్నారు. కొన్ని ఆహార పదార్థాలు కడుపు సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతాయి.
ఈరోజుల్లో చాలా మంది ఫాస్ట్ ఫుడ్ (Fast Foods)కు అలవాటు పడిపోతున్నారు. దీనివల్ల వారు రాబోయే రోజుల్లో ఎంతటి నరకం అనుభవిస్తారో గుర్తించడం లేదు. తాజాగా చాలా మందికి తిన్నది అరగకపోవడం, కడుపు ఉబ్బరం(Stomach Ache)గా ఉండటం, ఎసిడిటి (ACDT), అజీర్ణ సమస్యలు వంటివి తలెత్తుతున్నాయి. ఇంకొందరికి అయితే పొత్తి కడుపు నొప్పిగా ఉండి తీవ్ర ఇబ్బందిని కలగజేస్తోంది. అయితే చాలా మంది అప్పటికప్పుడు ఉపశమనం కోసం మందులు వేసుకుంటూ, సోడాలు తాగుతూ కొంత వరకూ ఉపశమనం పొందుతున్నారు.
ఫైబర్, కొవ్వు పదార్థాలు అతిగా తినడం వల్ల కడుపు ఆరోగ్యం(Health)పై ప్రభావం చూపుతుంది. కార్బోహైడ్రేట్లు, లీన్ ప్రోటీన్లు ఉండే ఆహారం తీసుకుంటే జీర్ణ సమస్యలు ఉండవు. కడుపును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కడుపు నొప్పి (Stomach Ache)గా ఉంటే అల్లం నీరు (Ginger Water) తాగడం మంచిది. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉండటం వల్ల అవి కడుపు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే కడుపు లైనింగ్ వాపును కూడా తగ్గిస్తుంది. పొట్టలోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో ఉపయోగపడుతుంది.
ఉలవల్లో ఫైబర్, ఒమేగా2 ఫ్యాటీ యాసిడ్లు ఉన్నాయి. ఇవి జీర్ణ వ్యవస్థ (Digestive System)కు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే అరటిపండ్ల (Bananas)లో ప్రీబయోటిక్ లక్షణాలనేవి ఉన్నాయి. పేగులలోని ద్రవాన్ని గ్రహించి మలాన్ని దృఢంగా చేయడంలో అరటిపండ్లు ఉపయోగపడతాయి. అతిసారం తగ్గాలంటే అరటిపండ్లు తినడం ఎంతో ఉత్తమం.
బియ్యం (Rice), వోట్మీల్, క్రాకర్స్ టోస్ట్ వంటి బ్లాండ్ కార్బోహైడ్రేట్లు కడుపు నొప్పి(Stomach Ache) సమస్యను తగ్గిస్తాయి. సాదా వైట్ రైస్(White rice) అనేది గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సమస్యకు చక్కగా ఉపయోగపడుతుంది. ఇది జీర్ణం అవ్వడాన్ని సులభతరం చేస్తుంది. గ్యాస్(Gas), ఉబ్బరం, పేగు కదలికలను వైట్ రైస్ తగ్గిస్తుంది. కడుపు నొప్పి(stomach Ache)గా ఉంటే మజ్జిగలో కాస్త జీలకర్ర పొడి వేసుకుని తాగితే సమస్య తగ్గుతుంది.