Health Tips : వీటితో కిడ్నీలో రాళ్లను కరిగించుకోండిలా..బెనిఫిట్స్ ఇవే
నేటి రోజుల్లో చాలా మందికి కిడ్నీల్లో రాళ్లు(Kidney stones) ఏర్పడుతున్నాయి. ఈ సమస్య అందరికీ ఇప్పుడు సాధారణమైపోయింది. కిడ్నీ స్టోన్ అనేది మూత్రంలోని రసాయనాల నుంచి ఏర్పడేటటువంటి ఒక గట్టి వస్తువు అని అందరూ గుర్తించుకోవాలి.
నేటి రోజుల్లో చాలా మందికి కిడ్నీల్లో రాళ్లు(Kidney stones) ఏర్పడుతున్నాయి. ఈ సమస్య అందరికీ ఇప్పుడు సాధారణమైపోయింది. కిడ్నీ స్టోన్ అనేది మూత్రంలోని రసాయనాల నుంచి ఏర్పడేటటువంటి ఒక గట్టి వస్తువు అని అందరూ గుర్తించుకోవాలి. రక్తం(Blood)లో చాలా వ్యర్థాలు ఉంటే శరీరం తగినంత మూత్రాన్ని ఉత్పత్తి చేయదు. అప్పుడే కిడ్నీల్లో స్ఫటికాలు ఏర్పడుతాయి. అందుకే ప్రతి ఒక్కరూ రోజూ 8 నుంచి 12 గ్లాసుల నీళ్లు(Water) తాగడం ఎంతో ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. కిడ్నీలో ఏర్పడిన రాళ్లను కరిగించుకోవడానికి కొన్ని రకాల పానీయాలు(Drinks) సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మరసం(Lemon Juice) కిడ్నీ(Kidneys)ల్లో రాళ్లను కరిగేలా చేస్తుంది. నిమ్మకాయలో సిట్రేట్ అనేది ఉంటుంది. అది కాల్షియం రాళ్లను ఏర్పడకుండా చేస్తుంది. రోజూ రెండు లీటర్ల నీటిలో నాలుగు నిమ్మకాయలను పిండి తాగితే కిడ్నీలో రాళ్లు(Kidney Stones) ఏర్పడకుండా నిరోధించవచ్చు. దానిమ్మ రసం (Pomegranate Juice) కూడా మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది.
దానిమ్మ రసం (Pomegranate Juice) అల్సర్లు, విరేచనాలను నయం చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. భవిష్యత్తులో మూత్రపిండాల్లో రాళ్లు (Kidney stones) ఏర్పడకుండా ఉండే ప్రమాదాన్ని తగ్గించడానికి దానిమ్మ రసం ఎంతగానో తోడ్పడుతుంది. దానిమ్మ రసం తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి(Immunity) మెరుగుపడుతుంది. రక్తం(Blood)లో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి.
గోధుమ గడ్డి రసం జ్యూస్ (Wheat Grass Juice)ను ఎక్కువ మంది తాగరు. ఇందులో అద్భుత పోషకాలు ఉన్నాయి. గోధుమ గడ్డి రసాన్ని మొదటగా కొద్ది మొత్తంలో తీసుకోవాలి. ఆ తర్వాత కొద్ది రోజులకు కొంచెం కొంచెం ఎక్కువగా తీసుకోవడం చేస్తుంటే మూత్ర సంబంధిత వ్యాధులు (Kidney Problems) దూరం అవుతాయి. దీని వల్ల కిడ్నీల్లో రాళ్లు (Kidney stones) ఏర్పడే ప్రమాదం నుంచి ఉపశమనం పొందొచ్చు.
గ్రీన్ టీ (Green Tea)లో అధిక పోషకాలు ఉన్నాయి. కిడ్నీ(Kidney) ఆరోగ్యానికి గ్రీన్ టీ ఎంతగానో తోడ్పడుతుంది. ఇది కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది. ప్రతి రోజూ గ్రీన్ టీ తాగితే మూత్ర విసర్జన సమస్యలు మీ దరి చేరవు. కిడ్నీల్లో ఏర్పడిన రాళ్ల(Kidney stones)ను సులభంగా తొలగించేందుకు గ్రీన్ టీ ఎంతగానో ఉపయోగపడుతుంది.
డిప్రెషన్ ఎందుకు వస్తుంది? రాకుండా ఉండాలంటే చేయండిలా: