»Swara Bhasker Terms Rahul Gandhis Disqualification From Lok Sabha Blatant Misuse Of Law And Strong Arm Tactics For 2024 General Elections
Swara Bhaskar : రాహుల్ పై అనర్హత వేటు.. నటి స్వరా భాస్కర్ రియాక్షన్ ఇదే..!
Swara Bhaskar : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. బీజేపీ నేతలు సమర్థిస్తుంటే.. బీజేపీ యేతర పార్టీ లకు చెందిన వారు విమర్శిస్తున్నారు. కాగా... ఈ ఘటనపై తాజాగా సినీ నటి స్వరా భాస్కర్ కూడా స్పందిచడం విశేషం.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. బీజేపీ నేతలు సమర్థిస్తుంటే.. బీజేపీ యేతర పార్టీలకు చెందిన వారు విమర్శిస్తున్నారు. కాగా… ఈ ఘటనపై తాజాగా సినీ నటి స్వరా భాస్కర్ కూడా స్పందిచడం విశేషం.
రాహుల్ పై అనర్హత వేటును ఆమె ఖండించారు. ప్రజాస్వామ్య తల్లి తన బిడ్డను చంపేస్తోందంటూ ఆమె ట్వీట్ చేశారు. మాలేగావ్ పేలుళ్లలో కీలక నిందితురాలైన ప్రగ్యాసింగ్ ఠాకూర్ ఎంపీగా ఇంకా ఎలా కొనసాగుతున్నారంటూ ఆమె ప్రశ్నించారు. అచ్ఛే దిన్ అంటే ఒక ఉగ్రవాద కేసులో నిందితురాలుకు హింసను ప్రేరేపించేందుకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని మండిపడ్డారు.
ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకోబడిన ప్రభుత్వం, దాని వ్యవస్థలు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్న దేశాల్లో ఇప్పుడు భారత్ కూడా ఒక దేశమని ఆమె ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీపై ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత భారత్ కూడా రష్యా, టర్కీలా తయారైందని ఆమె పేర్కొన్నారు.
2019 పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని సూరత్ కోర్టు దోషిగా నిర్దారించింది. ఆయనకు రెండేండ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును పై కోర్టులో సవాల్ చేసుకునేందుకు ఆయనకు నెల రోజుల సమయాన్ని కోర్టు ఇచ్చింది. జైలు శిక్ష నేపథ్యంలో ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం రాహుల్ గాంధీపై లోక్ సభ సచివాలయం అనర్హత వేటు వేసింది.