Sunny Deol: బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ ప్రస్తుతం తన సినిమా గదర్ 2 విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. సన్నీ డియోల్ ఇంకా కూడా సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్నాడు. కొంతకాలం క్రితం సన్నీ డియోల్ కు సంబంధించి ఓ వీడియో వైరల్ అయింది. అందులో అతను ఎయిర్‌పోర్టులో ఫ్యాన్‌పై అరుస్తూ కనిపించాడు. సెల్ఫీ తీసుకోవడానికి ఓ అభిమాని సన్నీని సంప్రదించాడు. సెల్ఫీలు తీసుకునే సమయంలో అభిమాని ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు. ఆ తర్వాత సన్నీ డియోల్ కోపంతో అతనిపై అరవడం ప్రారంభించాడు. ఈ వైరల్ వీడియోపై సన్నీ డియోల్ ఇప్పుడు స్పందించారు.
విమానాశ్రయంలో తనకు ఎందుకు కోపం వచ్చిందో సన్నీ డియోల్ పోడ్కాస్ట్లో చెప్పాడు. నిరంతర ప్రయాణం, శరీరం అలసిపోవడం వల్ల తనకు కోపం వచ్చిందని సన్నీ చెప్పాడు. రణవీర్ అలహాబాద్ పోడ్కాస్ట్లో సన్నీ డియోల్ మాట్లాడుతూ – నేను నిరంతరం తిరుగుతూ ఉంటాను. ఇటీవల నాకు వెన్నునొప్పి కూడా వచ్చింది. కానీ ఇప్పటికీ నేను ఈ పని చేయాల్సి వచ్చింది. చాలా సార్లు నొప్పిగా ఉన్నా ఎక్కడికో ఒక దగ్గరకి ప్రయాణాలు తప్పడంలేదన్నారు. చాలా మంది అభిమానులు అప్పటికే సెల్ఫీలు తీసుకున్నా అక్కడి నుంచి వెళ్లడం లేదు. ఆ సమయంలో ఎవరో రికార్డింగ్ చేస్తున్నట్లు నేను చూడలేదు. నన్ను వదిలేయండి అని కోరుతున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. అభిమానులతో ఎమోషనల్ కనెక్షన్ ఉందని పేర్కొన్నాడు.
సన్నీ డియోల్ తన చిత్రం గదర్ 2 విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా రూ.500 కోట్ల క్లబ్లో చేరనుంది. రక్షాబంధన్ సందర్భంగా ఈ సినిమా కలెక్షన్లు బాగానే వస్తున్నాయి. సన్నీ డియోల్‌తో పాటు అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ, మనీష్ వాధ్వా, సిమ్రత్ కౌర్ ముఖ్యమైన పాత్రలు పోషించారు.