శ్రద్ధ కపూర్, రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ సినిమా ‘స్త్రీ 2’ ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన విజయాన్ని సాధించింది. 2018లో వచ్చిన ‘స్త్రీ’ చిత్రానికి ఇది సీక్వెల్, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి, బ్లాక్‌బస్టర్ స్టేటస్‌ను పొందింది. హిందీ లో సీక్వెల్స్ సాధారణంగా బాగా వసూళ్లు చేస్తాయి అన్న సంగతి తెలిసిందే, కానీ ఈ సినిమా మాత్రం చిన్న బడ్జెట్‌తో, పెద్ద స్టార్ల లేకుండా కూడా దిమ్మ తిరిగే కలెక్షన్లు రాబడుతుంది.
ఈ సినిమాకు వస్తున్న కలెక్టన్లు చూస్తుంటే బాలీవుడ్ ట్రేడ్ లో ఇదొక ట్రెండ్ సెట్టింగ్ మూవీ అని చెప్పాలి. స్టార్స్ లేకుండా, ప్రేక్షకులకు విభిన్నత చూపిస్తూ పెద్ద సంఖ్యలో ఆదరణ పొందింది. ఇది సినీ పరిశ్రమలో చిన్న బడ్జెట్ చిత్రాలు కూడా భారీ విజయాలను సాధించగలవని, సాంకేతికతకు, కధా సమర్పణకు ప్రాధాన్యం ఇస్తూ సినిమాలు చేస్తే పెద్ద హిట్లు కొట్టొచ్చని మరొకసారి నిరూపితమైంది
ఈ సక్సెస్ గురించి దర్శకుడు అమర్ కౌశిక్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘స్త్రీ 2’ చిత్రం కోసం వారు రెండు సంవత్సరాలుగా కష్టపడినట్లు పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని రూపొందించడానికి గడిచిన సమయం, కష్టాలు తగిన రీతిలో ఫలితంగా నిలిచాయని, తమ శ్రమకు మంచి ఫలితం లభించిందని ఆయన తెలిపారు. ‘ఈ విజయాన్ని అంచనా వేయలేదు అన్నారు.
స్త్రీ 2 ఫుల్ రన్ లో 750 కోట్లు గ్రాస్ పైన రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ లో ఇదే హైయెస్ట్ ఫిలిం గా చరిత్ర సృష్టించింది. ఆదా శర్మ నటించిన ది కేరళ స్టోరీ 300 కోట్ల ఫుల్ రన్ ను స్త్రీ 2 కేవలం పది రోజుల్లో దాటేసింది